కాశ్మీర్ లో నియోజకవర్గాలు పునర్విభజన: సిఈసి

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన త్వరలో చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ (సిఈసి) ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు.

అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూలో 53,78,538 మంది, కాశ్మీర్ లో 68,88,475 మంది ఉన్నారన్నారు. నియోజకవర్గాల పునర్విభజన 2011 జనాభా లెక్కల ప్రకారం ఉంటుందన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) లో ఉన్న 24 సీట్లు ఖాళీగా ఉంటాయని, వాటిని పునర్విభజన లో కలపడం లేదన్నారు. తొలుత కాశ్మీర్ లో పునర్విభజన కమిషన్ 1981 లో ఏర్పాటు చేయగా, 1995 లో నివేదిక సమర్పించిందన్నారు. 1981 జనాభాల లెక్కల ప్రకారమే నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గాల పునర్వభిజన జరగలేదన్నారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు సీట్లను రిజర్వ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో కొత్తగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని సుశీల్ చంద్ర సూచనప్రాయంగా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.