ఢిల్లీలో ప్రకంపనలు… జనం పరుగులు!

న్యూఢిల్లీ: హర్యానాలో భూమి కంపించడంతో ఆ ప్రభావం ఢిల్లీపై చూపించింది. సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి 10.37 గంటలకు ఝజ్జర్ కు ఉత్తరాన పది కిలోమీటర్ల దూరంలో, భూమి లోపల ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 3.7 గా నమోదు అయ్యింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఏమో జరుగుతుందంటూ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో శబ్ధాల దాటికి ఇంట్లోని వస్తువులు కదిలాయి. ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో రెండు డజన్ల సార్లు భూకంపాలు వచ్చాయి. జోన్-4 పరిధిలో ఉన్న ఢిల్లీకి భూకంపాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. రిక్టర్ స్కేల్ పై 6 నమోదు అయితే భద్రతా నిబంధనలు పాటించని భవనాలు పెద్ద ఎత్తున కూలిపోతాయని ఇంతకు ముందే నేషనల్ జియాలజీ సైంటిస్టులు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.