హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం

చండీగఢ్: హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం నిరాడంబరంగా కరోనా నిబంధనల మధ్య నిర్వహించారు.
పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూరతి రవి శంకర్ ఝా దత్తాత్రేయ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు పాల్గొన్నారు.

ఇంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు. అక్కడి నుంచి హర్యానాకు బదిలీ చేశారు. 1947, జూన్ 12న హైదరాబాద్ లో జన్మించిన దత్తాత్రేయ ఆర్ఎస్ఎస్ లో 1965 సంవత్సరం చేరారు. 1968 నుంచి 1989 వరకు ప్రచారక్ గా పనిచేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలుపొంది హ్యట్రిక్ సాధించారు. ఏబి వాజపేయి తో పాటు నరేంద్ర మోదీ ప్రభుత్వం లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2019 సెప్టెంబర్ లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు.

Leave A Reply

Your email address will not be published.