కిడ్నీ సేల్ పేరుతో సైబర్ చీటింగ్

హైదరాబాద్: అప్పు తీర్చడం కోసం కిడ్నీలు అమ్మాలనుకున్న దంపతులు సైబర్ చీటర్స్ చేతిలో రూ.40 లక్షలు మోసపోయారు.

నగరంలో ఉంటున్న భార్యాభర్తలు వ్యాపారం చేసి లైఫ్ లో సెట్ అవుదాం అనుకున్నారు. గత సంవత్సరం కోటి రూపాయలు అప్పు చేసి వ్యాపారం మొదలు పట్టారు. లాక్ డౌన్ రావడంతో వ్యాపారం దివాళా తీసింది. అప్పు కట్టడం కోసం వారు తీసుకున్న నిర్ణయం హృదయ విధారకంగా మారింది. ఏకంగా కిడ్నీలు అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం ఆన్ లైన్ లో సర్చ్ చేశారు. ఓ సైబర్ కేటుగాడు 1.2 కోట్ల రూపాయలకు కిడ్నీ కొనుగోలు చేస్తానని నమ్మించాడు. వివిధ టెస్టులు, అనుమతి కోసం అంటూ పలు చార్జీల పేరుతో రూ.40 లక్షల రూపాయలు కాజేశాడు. ఆ తరువాత నుంచి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించారు.
దిక్కుతోచని స్థితిలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు భార్యాభర్తలు పిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.