జనవాసాల మధ్య మొసలి సందడి
బెంగళూరు: జలాశయాల్లో మొసళ్లు కన్పిస్తేనే హడలిపోతుంటాం. అలాంటిది కాలనీలో కన్పిస్తే ఇంకా జడుసుకోక ఏం చేస్తారు. మొసలి వచ్చిందనే తెలుసుకున్న కాలనీవాసులు తమ ఇళ్లకు గడియ వేసుకున్నారు.
కొగిల్బాన్ గ్రామంలోకి ఒక భారీ మొసలి వచ్చింది. కాలనీలో నడుస్తూ వస్తుండడం ఒక వ్యక్తి చూసి అందరినీ అప్రమత్తం చేశాడు. భయాందళనకు గురైన కాలనీవాసులు తలుపులు, కిటీకీలు మూసుకున్నారు. ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియచేయగా, వారు వచ్చి బంధించి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల తరువాత దాన్ని నదిలోకి వదిలేశారు. మొసలిని బంధించి తీసుకువెళ్లడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.