కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతమే

హైదరాబాద్: భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ సామర్థ్యం వెల్లడైంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో 77.8 శాతం సామర్థ్యం చూపించినట్లు భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించింది.

ఇండియాలో జరిగిన అతిపెద్ద ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ సురక్షితమైందని రుజువైనట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 2020 లో జరిగిన మూడో దశ ట్రయల్స్ లో 25,798 మంది వాలంటీర్లు పాల్గొని ఫస్ట్ డోసు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో 24,419 మంది సెకండ్ డోసు తీసుకున్నారు. ఈ ట్రయల్స్ లో 146 రోజుల పాటు వ్యాక్సిన్ వేసుకున్నవారిని నిరంతరం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా, బీటా వేరియంట్లను నిరోధించడంతో 65.2 సమర్థతను కనబర్చింది.

Leave A Reply

Your email address will not be published.