కరోనా ఎఫెక్ట్… బంగారం తెగనమ్ముతున్నారు

ముంబయి: కరోనా మహమ్మారితో ప్రజల జీవితాలు తల్లకిందులయ్యాయి. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వైద్యానికి ఖర్చులు పెరిగిపోయవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో బంగారం తెగనమ్మారు.
మరికొందరు తనఖా పెట్టి లక్షల్లో అప్పులు చేశారు. ఉద్యోగం లేకపోవడంతో రోజువారి నిర్వహణ కోసం బంగారం విక్రయిస్తున్నారు.

ఎన్నడూ లేని విధంగా గత మే నెలలో బంగారం పై తీసుకున్న రుణాలు 33.8 శాతం పెరిగాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) ప్రకటించింది. ఏడాది కాలంలో ఏ రంగం వారు తీసుకోనంతగా బంగారం తనఖా పెట్టి తీసుకున్నట్లు వెల్లడించింది. గత ఏడాది మే నాటికి బంగారం పై రూ.15,686 కోట్లు అప్పు తీసుకోగా ఈ ఏడాది మే నెల వరకు రూ.46,415 కోట్లు అప్పులు తీసుకున్నారు. ఒక్క ఎస్.బి.ఐ రూ.20,987 కోట్ల రుణాలు ఇచ్చింది. బంగారం పై తనఖా పెట్టుకున్న రుణాలకు 7.5 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. రాజస్థాన్ లోని రత్లాం, జైపూర్, మధ్యప్రదేశ్ లోని ఇండోర్, భోపాల్ పరిధిలోని రైతులు పంట సాగు కోసం బంగారం విక్రయించారు. మే నెలలో పర్సనల్ లోన్స్ కూడా ఎక్కువగానే తీసుకున్నారు. గతేడాది మే నెలలో 10.6 శాతం ఉండగా ఈ ఏడాది మే నెలలో 12.4 శాతానికి పెరిగింది.

Leave A Reply

Your email address will not be published.