నిన్న మహారాష్ట్ర నేడు ఫుదుచ్చేరి…
ఫుదుచ్చేరి: నిన్నటి వరకు మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు చిన్నారుల్లో అత్యధికంగా నమోదు అయ్యాయి. ఆ విషాదం నుంచి మరువక ముందే ఫుదుచ్చేరిలో చిన్నారుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి.
రోజువారీ నమోదవుతున్న మొత్తం కేసుల్లో పదిశాతం కేసుల్లో చిన్నారులు ఉన్నారు. కరోనా వైరస్ సోకిన వారిలో చిన్నారులతో పాటు శిశువులు కూడా ఉండడం తల్లిదండ్రులను కలవరపెడుతున్నది. పిల్లలను రక్షించుకునేందుకు ఆసుపత్రులలో మౌలిక సదుపాయలు పెంచుతామని ఫుదుచ్చేరి ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ అరుణ్ తెలిపారు. పిల్లల వార్డుల్లో ఐసియు ఆక్సిజన బెడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులను పిల్లలను కాపాడేందుకు కరోనా నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అరుణ్ కోరారు.