జనాభా నియంత్రిస్తాం: సిఎం యోగి

లక్నో: రాష్ట్రంలో జననాల రేటు తగ్గించి జనాభాను నియంత్రిస్తామని సిఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. 2021-2030కి గాను కొత్త జనాభా విధానాన్ని ఆయన ఇవాళ ప్రకటించారు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో జననాల రేటు వెయ్యికి 2.7గా ఉండగా 2026 లో వెయ్యికి 2.1 కి, 2030 లోపు 1.9 తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని యోగి తెలిపారు. రాష్ట్రంలో జనాభాను నియంత్రించాలంటే కచ్చితంగా ఇద్దరు పిల్లల మధ్య ఎడం పెంచాలని ఆయన అన్నారు.

పెరిగిపోతున్న జనాభా రాష్ట్ర, దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందన్నారు. పేదరికానికి జనాభా పెరుగుదల ప్రధాన కారణమన్నారు. దీని కోసం 2018 నుంచి పనిచేస్తున్నామని సిఎం వెల్లడించారు. ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రోత్సహిస్తామని, ఉల్లంఘించిన వారికి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అధికారం ఉండదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, సబ్సిడీలు కూడా దక్కకుండా కొత్త జనాభా విధాన ముసాయిదాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.