విశాఖ స్టీల్ వేలానికి కన్సల్టెంట్ ఎంపిక షురూ
విశాఖ: కార్మికులు, ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయం మాత్రం ఆగడం లేదు. ప్లాంట్ అమ్మకానికి కేంద్రం మరో ముందడుగు వేసింది.
వేలం వేసేందుకు కన్సల్టెంట్ నియామకానికి కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ వందశాతం విక్రయిస్తామని ప్రకటనలో తెలిపింది. ఆంధ్రా లోని జగ్గయ్యపేట, తెలంగాణ లోని మాదారం స్టీల్ ప్లాంట్ గనులను కూడా అమ్మకానికి పెట్టారు. బిడ్‌లో పాల్గొనేందుకు రూ.1లక్ష డిపాజిట్, రూ.1కోటి బ్యాంక్ గ్యారంటీ చూపాలని నోటిఫికేషన్లో షరతు విధించారు.