ఐదేళ్లలో ముగ్గురు సిఎంలు… సిగ్గు సిగ్గు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: బిజెపి అధినాయకత్వం తమకు నచ్చని ముఖ్యమంత్రులను మార్చడం ఆనవాయితీగా పెట్టుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 2017లో అధికారం చేపట్టింది మొదలు ఇప్పటి వరకు ముగ్గురు సిఎం లను బిజెపి మార్చిందని విమర్శించింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నాలుగున్నర నెలలు కాకుండానే తీరథ్ సింగ్ రావత్ ను బలవంతంగా రాజీనామా చేయించారని కాంగ్రెస్ నాయకుడు సూర్జేవాలా ఆరోపించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బదులు అధికారమే పరమావధిగా బిజెపి వ్యవహరిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించడం ద్వారా ప్రజలను వంచించారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో త్రివేంద్ర సింగ్, తీరథ్ సింగ్ రావత్ ను మార్చి మూడూ వ్యక్తిని నియమించారన్నారు. అంతకు ముందు నిత్యానంద స్వామి, భగత్ సింగ్ కోషియారి, బిసి ఖండూరీ, రమేస్ పోఖ్రియాల్ లను మార్చారన్నారు.

Leave A Reply

Your email address will not be published.