టిఆర్ఎస్ టికెట్ నాదే… కౌశిక్ రెడ్డికి నోటీసులు

హైదరాబాద్: మాజీ పిసిసి చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ టికెట్ నాదే అంటు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పిసిసి క్రమశిక్షణా సంఘం కౌశిక్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. టిఆర్ఎస్ టికెట్ తనకేనంటూ ఒక యువకుడితో మాట్లాడుతూ, తనకే టిఆర్ఎస్ టికెట్ వస్తుందని, ప్రచారం చేయాలని కౌశిక్ రెడ్డి కోరాడు. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. దీనిపై టిఆర్ఎస్ శ్రేణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ నేతలకు టచ్ లో ఉన్నారు. గత నెలలో నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కెటిఆర్ తో భేటీ కావడం సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన సమయంలో పిసిసి చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకుడితో భేటీ అయిన తరువాత కౌశిక్ రెడ్డి కి నోటీసు ఇవ్వకపోవడం అప్పట్లో పలువురు నాయకులు తప్పుపట్టారు.

Leave A Reply

Your email address will not be published.