రూ.50 కోట్లు ఇచ్చి పిసిసి తెచ్చుకున్నాడు: కౌశిక్ రెడ్డి

కరీంనగర్: పిసిసి అధ్యక్ష పదవి కోసం ఏ.రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని హుజూరాబాద్ నియోకవర్గ కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు రేవంత్ అమ్ముడుపోయారన్నారు.
రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాగూర్ కు రూ.50 కోట్లు ఇచ్చారన్నారు. రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించడం లేదన్నారు. నేనే రాజు, నేనే మంత్రిలా వ్యవహరిస్తున్నాడు. ఈటల రాజేందర్ కు మద్ధతు పలికే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.

మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కు టికెట్ ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం చేసుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి గురించి చేసిన ప్రతి ఆరోపణ కరెక్టు అన్నారు. నా బండారం బయటపెడ్తానని రేవంత్ అంటున్నాడు, నీ బండారం కూడా బయటపెడతానని, వదిలే ప్రసక్తి లేదని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఎవరెవరికి ఎప్పుడు డబ్బులు ఇచ్చింది, ఎక్కడ ఇచ్చిందనేది కూడా త్వరలో వెల్లడిస్తానన్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తే వదిలేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నారని, అలాంటి నాయకుడు ఉత్తమ్ పై రేవంత్ అవాకులు చెవాకులు పలుకుతున్నారన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఎలా చెబుతారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.