మణిపూర్ లో కాంగ్రెస్ కు షాక్

ఇంఫాల్: కాంగ్రెస్ పార్టీ మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగలనున్నది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపిసిసి) అధ్యక్షుడితో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు బిజెపిలోకి జంప్ చేస్తున్నారు.

ఇవాళ వీరందరూ బిజెపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న తరుణంలో కాంగ్రెస్ నాయకులు జంప్ కావడం పార్టీకి పెద్ద దెబ్బే అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బిజెపి కొద్ది రోజులుగా పావులు కదుపుతున్నది. కాషాయం నేతల ధాటికి కాంగ్రెస్ పార్టీ విలవిల్లాడుతున్నది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోవిందదాస్ కౌంతజమ్ రాజీనామా సమర్పించారు. కౌంతజమ్ వరుసగా ఆరుసార్లు బిష్నాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో ఆయనను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. మొన్నటి వరకు వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ పై విమర్శలు చేసిన ఆయన అకస్మాత్తుగా బిజెపిలో చేరడంపై పలువురు విస్మయం చెందుతున్నారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మంది సభ్యులు ఉండగా 24 మంది బిజెపి కాగా 17 మంది కాంగ్రెస్, నేషనల్ పీపుల్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ కు నలుగురు చొప్పున, ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.