కుప్పకూలిన ఫ్లైఓవర్ బీములు
విశాఖపట్నం: అనకాపల్లి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బీములు కూలడంతో రెండు కార్లు ధ్వంసం కాగా, ఇద్దరు చనిపోయారు.
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మిస్తన్న ఫ్లై ఓవర్ బీములు కూలడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బీములు కూలుతున్న సమయంలో పెద్ద పెద్ద శబ్ధాలు రావడంతో స్థానికులు పరుగులు తీశారు. ఒకేసారి పరుగులు తీయడంతో పలువురికి దెబ్బలు తగిలి కింద పడిపోయారు. వీరిని స్థానికంగా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనా ప్రాంతానికి పోలీసులు, అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.