పక్క రాష్ట్రాల్లో వేలు పెట్టను: సిఎం జగన్
అనంతపురం: పక్కనున్న ఏ ఒక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టనని, విభేధాలు కూడా వద్దని ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో మేము సఖ్యత కోరుకుంటున్నామని అన్నారు.
ఇవాళ అనంతపురం జిల్లా లో పలు అభివృద్ధి పనులకు సిఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రాయదుర్గ సభలో జగన్ మాట్లాడుతూ, తెలంగాణ రాజకీయాల్లో నేను వేలు పెట్టలేదని స్పష్టం చేశారు. కర్ణాటక రాజకీయాల్లో, తమిళనాడు రాజకీయాల్లో కూడా వేలు పెట్టలేదని జగన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఏ రాష్ట్రంలో తలదూర్చనని, నా రాష్ట్రానికే పరిమితం అవుతానని అన్నారు. రాష్ట్రాల మధ్య సఖ్యతతో పాటు పాలకుల మధ్య సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నట్లు జగన్ చెప్పారు.