ఆరుగురు పాకిస్థానీయులకు పౌరసత్వం
భోపాల్: పాకిస్థాన్ లో మతహింసకు గురై అక్కడి నుంచి భారతదేశం వలస వచ్చిన ఆరుగురికి పౌరసత్వం లభించింది. మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆరుగురికి భారత పౌరసత్వం పత్రాలు అందచేశారు.
మధ్యప్రదేశ్ లో కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న వీరికి పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) కింద పౌరసత్వం ఇచ్చినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించడం పట్ల సంతోషంగా ఉందని అర్జున్ దాస్ తెలిపారు. మూడు దశాబ్ధాలు గా నివసిస్తున్నా తమకు పౌరసత్వం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరసత్వం పొందిన వారిలో నందలాల్, అమిత్ కుమార్ లు భోపాల్ లో నివసిస్తున్నారు. అర్జున్ దాస్ మంచాందాని, జైరామ్ దాస్, నారాయణ దాస్, సౌశల్యా బాయ్ మాండ్ సౌర్ లో నివాసం ఉంటున్నారు. దశాబ్ధాలుగా నివసిస్తున్నా తమను అటు పాకిస్థాన్, ఇటు భారత్ కు చెందిన వారం కాదు అనే భావన ఉండేదని, ఇక నుంచి ఆ సమస్య ఉండదని అర్జున్ దాస్ సంతోషం వ్యక్తం చేశారు.