ఏపి ఫైబర్ నెట్ అక్రమాలపై సిఐడి దర్యాప్తు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్లో అక్రమాల ఆరోపణలపై ఏపి ప్రభుత్వం దృష్టి సారించింది. సిఐడి దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఫైబర్నెట్ కోసం గతంలో గుత్తేదారులకు అనుకూలంగా టెండర్ నిబంధనలు ఖరారు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి ఫైబర్నెట్ ఎండి, ఛైర్మన్ ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక అందచేశారు. దీనివల్ల కోట్లాది రూపాయలు చేతులు మారాయని, లోతుగా విచారణ చేస్తే తప్ప దోషులు బయటకు రారని నివేదికలో తెలిపింది. నివేదికను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది.