దలైలామా జన్మదిన వేడుకలు… చొరబడ్డ చైనీయులు

లద్దాఖ్: బౌద్ధ మత గురువు దలైలామా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడాన్ని జీర్ణించుకోలేని చైనీయులు లద్దాఖ్ లోని డెమ్ చుక్ ప్రాంతంలో చొరబడ్డారు. సింధూ నది అవతలి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ పతాకం, పలు బ్యానర్లు పట్టుకుని సైనికులు, పౌరులు కన్పించారు.

ఈ ఘటన జూలై 6వ తేదీన జరిగింది. భారతీయ గ్రామాల్లో దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరపుకోవడాన్ని నిరసిస్తూ చైనీయులు ఈ దారుణానికి తెగబడ్డారు. చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ 100వ వార్షికోత్సవం సంద్రభంగా శుభాకాంక్షలు తెలపని ప్రధాని నరేంద్ర మోదీ, దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఆ దేశానికి మింగుడు పడడం లేదు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దలైలామా పుట్టిన రోజును అవకాశంగా తీసుకుని చైనీయులు నిరసనకు దిగుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.