స్కూళ్లు తెరిచేది లేదు… ఆన్ లైన్ లోనే క్లాసులు!

న్యూఢిల్లీ: విద్యార్థులకు భౌతికంగా క్లాసులు నిర్వహించే పరిస్థితి లేనందున స్కూళ్లు మూసివేసి ఉంటాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు స్కూళ్లను తెరిచేది లేదని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ కారణంగా దేశంలో విద్యాసంస్థలను మూసివేశారు. ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు.

సెకండ్ వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టనే లేదు థర్డ్ వేవ్ కూడా మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు ప్రకటించిది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు క్లాసుల నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ మాత్రం స్పష్టత ఇచ్చారు. ఇప్పట్లో స్కూళ్లు తెరిచే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగిసే వరకు పిల్లల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోమని అన్నారు. అంతర్జాతీయ నిపుణుల అంచనా ప్రకారం థర్డ్ వేవ్ ప్రారంభమైందని, ఈ పరిస్థితుల్లో పిల్లలను ప్రమాదంలో నెట్టబోమని అరవింద్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.