ఒక్కసారి ఛార్జింగ్… 3 రోజులు పని!

న్యూఢిల్లీ: మూడు రోజుల పాటు బ్యాటరీ పనిచేసే మొబైల్ ను నోకియా విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మూడు రోజుల పాటు వాడుకోవచ్చని హెచ్ఎండి గ్లోబల్ సంస్థ ప్రకటించింది.

నోకియా జి20 పేరుతో విడుదలైన ఈ మొబైల్ ధర రూ.12,999 అని, క్వాడ్ కెమెరాతో వస్తున్నది. 4 జిబి ర్యామ్, 64 జిబి అంతర్గత మెమోరీ ఉన్న ఈ మోడల్ ఫోన్ జూలై 15వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్నది. నోకియా ఇండియా వెబ్ ఫోర్టల్, అమెజాన్ ఇండియాలో ముందస్తు బుకింగ్ లు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.