వైరస్ తగ్గలేదు… యూరప్ దేశాల్లో పెరుగుతోంది: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టలేదని, చాలా జిల్లాల్లో పాజిటివిటీ రేటు పదిశాతం పైగా నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

కరోనా వైరస్ తీవ్రత లేదని ఏమరుపాటుగా ఉంటే చిక్కులు తప్పవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో సమస్మాత్మక జిల్లాలు ఉన్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ తెలిపారు. వైరస్ తగ్గిందని నిర్లక్ష్యం పాటించవద్దని, యూరప్ దేశాల్లో కేసులు పెరుగుతున్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. జూన్ 21వ తేదీ నుంచి రోజుకు సగటున 50 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శ లవ అగర్వాల్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.