మూడు దేశాల్లో కేసులు.. బీ కేర్ ఫుల్: కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని, ఇక వైరస్ పీడ లేదని అనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.
కరోనా సెకండ్ వేవ్ ఇంకా దేశం నుంచి పోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ అగర్వాల్ స్పష్టం చేశారు. బ్రిటన్, రష్యా, బంగ్లాదేశ్ లలో కరోనా కేసుల ఉధృతి తగ్గలేదని, పెరుగుతునే ఉందని ఆయన వివరించారు. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దక్షిణ కొరియాలో మళ్లీ కేసులు పెరగడంతో లాక్ డౌన్ అమలు చేస్తున్నారన్నారు. పర్యాటక ప్రాంతాలు, పబ్బులు, బార్లు, ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోవడంతో కేసులు మున్ముందు పెరిగే ప్రమాదముందని, అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దని లవ అగర్వాల్ ప్రజలకు సూచించారు.