మున్సిపల్ కమిషనర్ పై లైంగిక వేధింపుల కేసు

ముంబయి: కొందరు అధికారులు మహిళలను లొంగదీసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేసిన ఒక డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పై ముంబయి పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

ముంబయి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఏడాది కిందట ఒక మహిళ కాంట్రాక్టు పద్దతిలో నర్సుగా ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో మున్సిపల్ ఆసుపత్రి పర్యవేక్షకుడిగా డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేల్కర్ వ్యవహరించారు. ఆ సమయంలో పలు రకాలుగా ఆమెను వేధింపులకు గురిచేసినా భరిస్తూ ఉద్యోగం చేసింది. వేధింపులు ఆగకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. బయోడేటాలో సరైన పత్రాలు లేవంటూ ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ చర్యపై న్యాయం కోసం ఆమె లైంగిక వేధింపుల కమిటీ వైస్ ప్రెసిడెంట్ చిత్ర వాఘ్ ను కలిసింది. తనకు జరిగిన అన్యాయంపై వివరించి, ఫిర్యాదు చేసింది. విచారణ తరువాత డాక్టర్ కేల్కర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.