చార్ ధామ్ యాత్ర లైవ్ టెలీకాస్ట్ కుదరదా?

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర, భద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లో నిర్వహించే కైంకర్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే హైకోర్టు ఆదేశాలను ఆగమ పండితులు తిరస్కరించారు.

ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఉన్నందున లైవ్ టెలీకాస్ట్ సాధ్యం కాదని ఆలయ పండితులు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేశారు. నాలుగు ఆలయాల్లో నిర్వహించే కైంకర్యాలను లైవ్ టెలికాస్ట్ చేయడం కుదరని ఉత్తరాఖండ్ మంత్రి మండలి కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది. కరోనా మహమ్మారి ఉన్నందున చార్ ధామ్ యాత్రను రద్దు చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించింది. ప్రతి ఏడాది మాదిరే ఈ సంవత్సరం కూడా జూలై 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రెండో దశ చార్ ధామ్ యాత్ర నిర్వహిస్తున్నారు. భక్తుల ఎక్కువ సంఖ్యలో వచ్చే ప్రమాదం ఉండడంతో కరోనా విస్తరిస్తుందంటూ ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు స్టే విధించింది. భక్తులు తమ ఇళ్ల నుంచే వీక్షించేందుకు లైవ్ టెలికాస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.