హైతి అధ్యక్షుడి పై తూటాల వర్షం

పోర్టో ప్రిన్స్: కరేబియన్ దేశం హైతి అధ్యక్షుడు జొవెనెల్ మొయిసే ను తుపాకులతో దారునంగా చంపారు. మొయిసే ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆయనతో పాటు భార్యపై తూటాల వర్షం కురిపించారు.

ఈ దాడిలో ఆయన చనిపోగా భార్య మార్టిన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని దేశ తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. ఇదో దుర్మార్గపు, అమానవీయ చర్యగా అభివర్ణించారు. దేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం లేకపోవడంతో గ్యాంగ్ వార్ లు పెరిగి అధ్యక్షుడి హత్యకు దారితీశాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.