మొదలైన గోల్కొండ బోనాలు

హైదరాబాద్: గోల్కొండ కోట వద్ద జగదాంబికా మహంకాళి అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో నగరంలో బోనాల పండుగ మొదలైంది. సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు.
ఆ తరువాత ప్రతి వారం ఒక ప్రాంతంలో బోనాల జాతర ప్రారంభమవుతుంది.

ఈ నెల 13న బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కళ్యాణం, 25, 26 తేదీల్లో సికింద్రాబాద్ లో ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆగస్టు 1, 2 న ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ సింహ వాహిని మహంకాళీ అమ్మవారి బోనాలు నిర్వహించనున్నారు. కరోనా కావడంతో ఈసారి కూడా భక్తుల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయి. అధికారులు కూడా ముందస్తు ఏర్పాట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.