థాంక్యూ గాడ్… బేబి బంప్

బాలీవుడ్ నటీమణి నేహా ధూపియా బేబి బంప తో ఉన్న ఫ్యామిలీ ఫోటోను ట్విటర్ లో షేర్ చేసింది. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న దూపియా దంపతులు ప్రకటించారు. బేబి బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ మంచి క్యాప్షన్ తో రావడానికి రెండు రోజులు పట్టింది.
మేము ఆలోచించిన వాటిలో ఉత్తమమైనది ఇదే…

థాంక్యూ గాడ్ అంటూ ఫ్యామిలీ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. 2018లో అంగద్ బేడీని ధూపియా వివాహం చేసుకున్నది. అదే సంవత్సరం మెహర్ అనే బిడ్డకు జన్మనిచ్చింది. మిస్ ఇండియా, ది మిస్టరీ హిందీ చిత్రాలలో నటించింది. తెలుగులో కూడా నిన్నే ఇష్టపడ్డాను, విలన్ చిత్రాలలో నటించి అభిమానులను మెప్పించింది.

Leave A Reply

Your email address will not be published.