మరోసారి విడాకులు తీసుకున్న బాలీవుడ్ నటుడు

ముంబయి: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరోసారి విడాకులు తీసుకుంటున్నారు. తమ పదిహేనేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అమీర్ ఖాన్, కిరణ్ రావు లు ప్రకటించారు.

జీవితంలో కొత్త శకానికి నాంది పలకడం కోసమే విడాకులు తీసుకుంటున్నామని తెలిపారు. 1965 లో జన్మించిన మహ్మద్ అమీర్ హుస్సేన్ ఖాన్ ఇప్పటి వరకు రెండు వివాహాలు చేసుకున్నారు. తొలి వివాహం రీనా దత్ ను 1986 లో చేసుకున్నారు. 2002లో ఆమె తో విడిపోయి 2005లో కిరణ్ రావు ను పెళ్లాడారు. మొదటి భార్యకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా రెండో భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు.

Leave A Reply

Your email address will not be published.