హీరో సూర్యకు వార్నింగ్

సీనిమాల్లో రంగులు పూసుకుని వేషాలు వేసుకో… అంతేకాని బిజెపిని విమర్శిస్తే ఊరుకోమని తమిళనాడు బిజెపి హెచ్చరించింది. ఇతర విషయాలపై అనవసర జోక్యం, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికింది.
తమిళనాడు బిజెపి రాష్ట్ర యువజన విభాగం ఇటీవల సమావేశం అయ్యింది. ఈ సమావేశం సూర్య వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.

భవిష్యత్తులో సూర్య తమ హెచ్చరికలను బేఖాతర్ చేసినా, తప్పుడు ప్రచారాలకు పాల్పడితే కోర్టుల చుట్టూ తిప్పుతామని హెచ్చరిక స్టేట్ మెంట్ చేశారు. ఈ హెచ్చరికలపై సూర్య ఎలా స్పందిస్తారో చూడాలి. తమిళనాడులో గత కొద్ది రోజులుగా సినిమా హీరోలు బిజెపి విరుచుకుపడుతున్నారు. అజిత్, విజయ్, సూర్యతో పాటు సిద్ధార్థ్ లు బిజెపి ని తూర్పారబడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నూతన సినిమాటోగ్రఫీ బిల్లును తీసుకువచ్చింది. ఈ నిర్ణయంతో సినిమాపై ఉండే పెత్తనం రాష్ట్రాల చేతుల నుంచి కేంద్రం పరిధిలోకి వెళ్తుంది. ఈ బిల్లును ప్రాంతీయ భాషా సినీ పరిశ్రమ పెద్దలు వ్యతిరేకిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బిల్లుపై సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నీట్ ను కూడా వ్యతిరేకించారు. గ్రామీణ పేద విద్యార్థులు నష్టపోతారన్నారు.

Leave A Reply

Your email address will not be published.