మహిళా నేత చీర లాగిన బిజెపి నాయకులు

లక్నో: ఉత్తరప్రదేశ్ లో బిజెపి నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. దేశభక్తి పార్టీగా చెప్పుకునే బిజెపిలో కౌరవులు తయారవుతున్నారు. బ్లాక్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార బిజెపి, ప్రతిపక్ష పార్ సమాజ్ వాదీ నాయకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

లఖింపూర్ ఖేరి జిల్లాలోని పాస్ గాన్ బ్లాకన్ నుంచి సమాజ్ వాదీ మహిళా నాయకురాలు రీతూ సింగ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరింది. నామినేషన్ వేసేందుకు వెళ్లవద్దని అడ్డగించగా, ఆగకుండు ముందుకు కదిలింది. దీంతో ఆగ్రహించిన బిజెపి నాయకులు ఆమె నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారు. ఆ తరువాత ఆమె చీరను లాగారు. ఈ వీడియోను సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విటర్ లో షేర్ చేశారు. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం గుండాగిరి చేస్తున్నదని విమర్శించారు. రీతూసింగ్ పై దాడి వెనక స్థానిక బిజెపి ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.