జింక మాంసం పేరుతో బడా మోసం

మంచిర్యాల: జింక మాంసం ఉందంటే నోరూరుతుంది. ఆహారప్రియుల బలహీనతలను ఆసరాగా చేసుకుని జింక మాంసం పేరుతో గొడ్డు మాంసం విక్రయిస్తున్నారు. ఈ ముఠాను మంచిర్యాల పోలీసులు పట్టుకున్నారు.

తొమ్మిది మంది ముఠా సభ్యుల నుంచి రెండు ఆటోలు, గొడ్డలి, ఆరు కత్తులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నాడు వీరిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. దుగినేపల్లి గ్రామానికి చందిన కుమ్మరి కళ్యాణ్, జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ ఒక గ్రూపుగా తయారయ్యారు. గత ఆరు నెలలుగా పొలాల్లో మేత కోసం వచ్చిన పశువులను ఆపహరించుకుని వెళ్లేవారు. వీటి చర్మం తొలగించి మచ్చల జింక మాంసం, అడవి పంది మాంసం గా చెప్పి ఒక్కో కేజీని రూ.800 కు విక్రయించారు. పశువులు కన్పించడం లేదని రైతులు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.

 

Leave A Reply

Your email address will not be published.