1999 లోనే రూ.900 కోట్లు అప్పులు చేశా: బిగ్ బి

ముంబయి: తన సినిమాల ద్వారా ఎందరినో అలరించినప్పటికీ ఒకానొక దశలో అప్పులు ఊబిలో కూరుకుపోయిన సతమతమయ్యారు. ఆయనే బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.
1999లో తాను ఎదుర్కొన్న ఆర్థిక కష్టాల గురించి ఒక ప్రముఖ పత్రికకు అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. 44 సంవత్సరాల సినిమా కేరీర్ లో 1999 సంవత్సరం గడ్డుకాలం అని అన్నారు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ (ఏబిసి) స్థాపించి అప్పుల్లో మునిగినట్లు చెప్పారు. అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటికి వచ్చి నీచంగా మాట్లాడేవారని, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి దూషించి పోయేవారన్నారు. ఎలా బయటపడాలో అర్థం కాక చాలా రోజులు మదనపడ్డాను. ఆ సమయంలో సాయం చేసేవారి కోసం ఎదురు చూసినా ఫలితం దక్కలేదు. గుండె ధైర్యంతో ముందుకు సాగి అప్పులు తీర్చుకుంటూ వచ్చానన్నారు. నాలుగైదు సంవత్సరాలలో అప్పులు తీర్చేశానని అమితాబ్ చెప్పుకొచ్చారు.
చివరకు దూరదర్శన్ కు బకాయిపడిన మొత్తాన్ని కూడా చెల్లించానన్నారు.

వడ్డీ చెల్లింపుల కోసం దూరదర్శన్ కు యాడ్స్ చేసి తీర్చేయడం జరిగిందని వివరించారు. 2000 సంవత్సరం తనకు బాగా కలిసి వచ్చిందని, అప్పుల నుంచి బయటపడే మార్గం కన్పిందన్నారు. ఆ సమయంలో నా ఇంటి వెనకాలే ఉన్న యాశ్ చోప్రా ఇంటికి వెళ్లి కలిసి అప్పులు, సమస్యలపై సుధీర్ఘంగా చర్చించాను. ఆయన నాకు మెహబ్బతేన్ సినిమాలో అవకాశం ఇచ్చి ఆర్థికంగా కాస్త నిలదొక్కుకునేలా చేయి అందించారు. ఆ సినిమా ద్వారా తనకు మళ్లీ అదృష్టం కలిసి వచ్చిందని, ఆ తరువాత నేను చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి సూపర్ సక్సెస్ అయ్యిందన్నారు. అలా అప్పుల సుడిగుండం నుంచి బయటపడి కేరీర్ లో నిలదొక్కుకున్నానని తెలిపారు. ఆ సమయంలో నాతో పలువురు ప్రవర్తించిన తీరు ఇప్పటికీ మరిచిపోనని, అందుకే ఇప్పటికీ శ్రమిస్తునే ఉంటానని అమితాబ్ బచ్చన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తన చేతి నిండా సినిమాలు ఉన్నాయని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.