ఫేస్ బుక్ పై బైడెన్ తీవ్ర విమర్శలు

వాషింగ్టన్: ఈ రోజుల్లో ఏ వార్త అయినా సోషల్ మీడియాలో నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. దీంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు. కొన్నిసార్లు తప్పుడు సమాచారం అయినా ఎక్కువ సంఖ్యలో షేర్ అవుతూ చేయాల్సిన నష్టాన్ని చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ ఫేస్ బుక్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజలను ఫేస్ బుక్ చంపేస్తున్నదని, వ్యాక్సినేషన్ పై అనవసర సమాచారం వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాక్సిన్ల పంపిణీ పై చాలా దారుణమైన రీతిలో తప్పుడు పోస్టు పెడుతున్నారన్నారు.

కరోనా మహమ్మారి పై విపరీతంగా ప్రచారం చేస్తూ భయోత్పాతం కల్పిస్తున్నారన్నారు. ఇలాంటి తప్పుడు పోస్టులను వైట్ హౌస్ కూడా గుర్తించిందన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టే ప్రయత్నం మొదలు పెట్టామన్నారు. కరోనా మహమ్మారిని జయించాలంటే ముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ కార్యక్రమం అన్నారు. వ్యాక్సిన్ వేసుకోని వారి మూలంగానే వైరస్ ప్రభలుతోందని, నమ్మకం లేకపోవడం మూలంగానే చాలా మంది దూరంగా ఉంటున్నారని బైడెన్ వ్యాఖ్యానించారు.
అమెరికన్లు విముఖత చూపించడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ విమర్శలను ఫేస్ బుక్ ఖండించింది. ప్రజల రక్షణ కోసమే తాము సమాచారాన్ని షేర్ చేస్తున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.