రేపే బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభం

హైదరాబాద్: బాలానగర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం నాడు ప్రారంభించనున్నారు. రూ.387 కోట్లతో ఈ భారీ ఫ్లై ఓవర్ ను నిర్మించారు.

మొత్త ఆరు లేన్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ తో మెదక్, సంగారెడ్డి జిల్లా వాసులకు కష్టాలు సమసిపోనున్నాయి. గత రెండు దశాబ్ధాలుగా ట్రాఫిక్ సమస్యలు తీర్చాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రజల వినతి మేరకు మూడు సంవత్సరాల క్రితం దీనికి మంట్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. భారీ ప్రాజెక్టు కావడంతో సిఎం కెసిఆర్ తో ప్రారంభించేందుకు అధికారులు గతవారమే ఏర్పాట్లు చేశారు. కెసిఆర్ సమయం ఇవ్వకపోవడంతో కెటిఆర్ తో ప్రారంభం చేయిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.