బాలా నగర్ ఫ్లై ఓవర్ ప్రారంభం
హైదరాబాద్: ఆరు వరుసలతో రూ.387 కోట్ల తో నిర్మాణం చేసిన బాలా నగర్ ఫ్లై ఓవర్ ను మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సి.మల్లారెడ్డి, టి.శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
1.13 కిలోమీటర్ల పొడవునా ఆరు లైన్లతో నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, బాచుపల్లి రహదారి విస్తరణ త్వరలో చేపడ్తామన్నారు. ప్యాట్ని నుంచి సుచిత్రా చౌరస్తా వరకు స్కై వే నిర్మాణం చేస్తామని, కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఒకవేళ అనుమతులు రానట్లయితే కుదించి నిర్మాణం చేస్తామన్నారు. బాలానగర్ ఫ్లై ఓవర్ కు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ పేరు పెడుతున్నట్లు కెటిఆర్ ప్రకటించారు.