గ్రూప్ వన్ ఉద్యోగం… మనిషి లేడు!

పాట్నా: ఇంజనీరింగ్ సెకండ్ ర్యాంకర్ అయిన అవినాశ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్ష రాశాడు. గ్రూప్ వన్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. కాని ఈలోపే కరోనా మహమ్మారి బలితీసుకున్నది.

అవినాశ్ (30)కు బిహార్ పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్ష రాసి గ్రూప్ వన్ ఉద్యోగాన్ని సాధించాలనేది కల. ఆ కల ను నెరవేర్చుకునేందుకు లక్షల రూపాయల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. అనుకున్నట్లుగా ప్రిపేర్ అయి పరీక్ష రాశాడు. ఈ లోపు కరోనా వైరస్ నిర్థారణ కావడంతో చికిత్స తీసుకున్నాడు. వ్యాధి తగ్గడంతో ఇంటికి వచ్చాడు. మళ్లీ తిరగబెట్టడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నప్పటికీ శ్వాసలో ఇబ్బందులు ఏర్పడి జూన్ 24న తుది శ్వాస విడిచాడు. చనిపోయిన వారం రోజులకు ఆయన ఇంటికి బిహార్ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్ వన్ ఉద్యోగానికి ఎంపికైనట్లు ఫలితాలు పంపించారు. ఈ ఫలితాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. తన కల నిజమైందని సంతోషించడానికి కుమారుడు లేరంటూ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఈ ఘటన చుట్టుపక్కల వారికి కూడా కన్నీళ్లు తెప్పించింది.

Leave A Reply

Your email address will not be published.