పాతబస్తీలో ముజ్ర పార్టీ, వీడియోగ్రాఫర్ పై దాడి

హైదరాబాద్: పాతబస్తీలో ఒక పెళ్లి విందు పార్టీలో ముజ్ర వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేశాడనే కోపంతో వీడియో గ్రాఫర్ పై దాడి చేశారు. తనపై అకారణంగా దాడి చేశారంటూ వీడియోగ్రాఫర్ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మొహమ్మద్ సిద్ధిఖీ మాదన్నపేటలో నివాసం ఉంటూ వీడియోలు షూట్ చేస్తుంటాడు. చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని వలీ ఫంక్షన్ హాలులో జూన్ 28వ తేదీన పెళ్లి విందు జరిగింది. ఒక ప్రత్యేక హాలులో నజీర్ అనే వ్యక్తి ముజ్ర పార్టీ ఏర్పాటు చేయించాడు. అమ్మాయిలతో కలిసి జల్సా చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియో గ్రాఫర్ లీక్ చేశాడని మనసులో పెట్టిన ముజ్ర నిర్వాహకులు అతనిపై దాడికి దిగారు. తనపై నజీర్, షేక్ సలాం, అబ్ధుల్ రజాక్, ఫైజర్ దాడి చేశారని, పిడిగుద్దులు గుద్దారని మొహమ్మద్ సిద్ధిఖీ పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ముజ్ర పార్టీ నిర్వహించడంపై ఫంక్షన్ హాలు యజమాని, పెళ్లి నిర్వహకులపై ఆగ్రహంతో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.