ఒలింపిక్స్ లో యాంటి సెక్స్ బెడ్స్

టోక్యో: క్రీడాకారుల అభిరుచులకు అనుగుణంగా తాము బస చేస్తున్న గదుల్లో బెడ్స్ ఏర్పాటు చేయకపోవడంతో గుర్రుగా ఉన్నారు. కర్ర చెక్కలతో ఏర్పాటు చేసిన మంచాలపై పడుకోలేమని, సెక్స్ కు అనువుగా లేవని అథ్లెట్లు విమర్శిస్తున్నారు.
శృంగారానికి ఏమాత్రం పనికిరావని, యాంటి సెక్స్ మంచాలు అంటూ మరికొందరు పెదవి విరుస్తూ ట్విటర్ లో కామెంట్లు పెడుతున్నారు.

అథ్లెట్ల కోసం కార్డుబోర్డు మంచాలు ఏర్పాటు చేశామని, వాటిపై మెత్తటి పరుపులు ఉన్నాయని ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. కార్డ్ బోర్డు చాలా గట్టిగా ఉన్నాయంటూ ఐర్లాండ్ జిమ్నాస్ట్ రైస్ మెక్ క్లినాగన్ ట్వీట్ చేశాడు. సెక్స్ కు పనికిరావనే వార్తలను తప్పుబట్టే విధంగా ఆయన ఎగిరి గంతేసే వీడియోను షేర్ చేశారు. అథ్లెట్ల కోసం ఒక లక్షా అరవై వేల కండోమ్ లను అందుబాటులో పెట్టారు.

Leave A Reply

Your email address will not be published.