ఏపి సర్కార్ కు హైకోర్టులో మళ్లీ ఎదురు దెబ్బ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జిఒ నెంబర్ 2 ను ఏపి హైకోర్టు సస్పెండ్ చేసింది.
గ్రామ పంచాయితీ సర్పంచులు, సెక్రటరీలు అధికారాలను కత్తెరించి గ్రామ రెవెన్యూ అధికారులు (విఆర్వోలు)కు అప్పగిస్తూ జారీ చేసిన జిఒ నెంబర్ 2 ను ఇవాళ సస్పెండ్ చేసింది. ఇప్పటి వరకు సర్పంచులు, కార్యదర్శు ఆధ్వర్యంలో జరిగిన పాలనను విఆర్వోలకు అప్పగించడమేంటని హైకోర్టు నిలదీసింది. పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జిఒ ను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణ మోహన్ పిటిషన్ వేశారు.