అంతరిక్షయానం కల నెరవేరుతోంది: శిరీష

హ్యూస్టన్: ఆంధ్రా అమ్మాయి బండ్ల శిరీష ఇవాళ అంతరిక్షంలోకి అడుగు పెట్టేందుకు వ్యోమ నౌకలో ప్రయాణించనున్నది. ఏపిలోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష హ్యూష్టన్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవింది.

చిన్నతనం నుంచి వ్యోమగామి కావాలనుకున్న తన కోరిక నేడు తీరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని శిరీష తెలిపింది. ఈ ప్రయాణంలో బాగస్వామ్యం కావడంతో ఎంతో సంతోషంగా ఉంది. వర్జిన్ గెలాక్టిక్ లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నది. ఇవాళ అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వ్యోమనౌక రోదసిలోకి బయలుదేరనున్నది. ఇందులో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధినేత సర్ రిచర్డ్ బ్రాన్ సన్ కూడా ప్రయాణించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2022 నుంచి పౌరులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లాలనేది వర్జిన్ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా అంతరిక్ష యానానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.