ఫుట్ బాల్ పై దురాభిమానం… 2వేల మందికి వైరస్

ఎడిన్ బర్గ్: కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు సుద్దులు చెబుతున్న ప్రభుత్వాలు క్రీడల విషయంలో మాత్రం ఇవేమి పట్టించుకోవడం లేదు. యూరప్ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తరుణంలో యూరో ఛాంపియన్ షిప్ స్కాట్లాండ్ కొంప ముంచింది.
ఫుట్ బాల్ అభిమానులు లండన్ కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రైలు, విమానాల్లో ప్రయాణం చేసి చేరుకున్న అభిమానులు హద్దులు మీరి ప్రవర్తించారు.

సాకర్ క్రీడను చూసేందుకు వెళ్లినవారిలో 2వేల మంది కరోనా బారినపడినట్లు స్కాట్లాండ్ ప్రజారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 1991 మందికి పాజిటివ్ నిర్థారణ కాగా అందులో 1294 మంది కేవలం ఇంగ్లాండ్-స్కాట్లాండ్ ఒక్క మ్యాచు కోసం వెంబేకి వెల్లి వచ్చిన వాళ్ళుగా అధికారులు ధృవీకరించారు. మ్యాచు కోసం వచ్చిన వారు బర్లు, పబ్బుల దగ్గర గుంపులు గుంపులుగా కలియతిరిగారు. మాస్కులు, భౌతిక దూరం పాటించకపోవడంతో మళ్లీ కేసులు పెరిగాయని అధికారులు వాపోయారు. రష్యాలో కూడా క్రీడల నిర్వహణ మూలంగానే డెల్టా వేరియంట్ కేసులు అమాంతం పెరిగిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.