మరో బయోపిక్ లో అక్షయ్

యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మరో బయోపిక్ లో నటించబోతున్నాడు. బ్రిటీష్ పాలన కాలంలో జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది. దాని వెనక ఉన్న కుట్రల నేపథ్యంలో సినిమా వస్తున్నది.

కుట్రలను చేధించేందుకు అనాటి మన లాయర్ సి.శంకరన్ నాయర్ ప్రాణాలకు తెగించి కోర్టులో పోరాటం చేశారు. ఆయన వాదనల వల్ల బ్రిటీష్ పాలకులు, అధికారుల రాక్షసత్వం బయటపడింది. జలియన్ వాలాబాగ్ ఉదంతంతో ఆనాడు భారతీయుల్లో స్వాతంత్ర్య కాంక్ష పెరిగిన విషయం తెలిసిందే. శంకరన్ కథ నేపథ్యంలో తీసే ఈ బయోపిక్ కు అక్షయ్ కుమార్ కన్పించబోతున్నాడు. దీనికి ముందు ఆయన అర డజన్ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇన్ని సినిమాలు ఉండగా మళ్లీ బయోపిక్ లో నటిస్తాడా అని అభిమానులు అనుమానిస్తున్నారు. కరణ్ త్యాగి, కరణ్ జోహార్ సంయుక్త నాయకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ నటించవచ్చని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.