ఏపి సిఐడి చీఫ్ పై చర్యలు: కేంద్ర హోం శాఖ
న్యూఢిల్లీ: ఏపి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలపై కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. సునీల్ ప్రసంగ వీడియోల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఆయనపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో పంపించాలని కేంద్రం సూచించింది. వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ఱరాజు సిఐడి అదనపు డిజి సునీల్ పై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. హిందూ మత వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారని ఆధారాలతో సహా సిడి లను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు అందచేశారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖ పంపించింది.