లో దుస్తుల చోరీ… ఏమైందంటే?
భోపాల్: లో దుస్తులు దొంగిలిస్తూ దొరికిపోయిన ఒకరు దొరికిపోయి ఊహించని విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన భోపాల్ నగరంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
టీనేజర్ ఒకరు తమ ఇంట్లో లో దుస్తులు దొంగతనం చేస్తుండగా దంపతులు చూశారు. అతడిని నిర్బంధించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయాడు. అతని వెంటే దంపతులు పరుగెత్తగా సోదరుడి ఇంట్లోకి దూరాడు. అతని సోదరుడి ఇంట్లో నుంచి పారిపోకుండా ఉండేందుకు బయట గడియ వేశారు. ఈ విషయాన్ని టీనేజర్ సోదరుడికి సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే సరికి ఆ వ్యక్తి ఉరేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దంపతులపై సెక్షన్ 306 కింద కేసు పెట్టారు. లో దుస్తులు దొంగిలించాడని పట్టుకోవడానికి వస్తే తమపైనే కేసు పెట్టారని దంపతులు లబోదిబోమంటున్నారు.