స్టుడెంట్ వీసాలపై కీలక నిర్ణయం : బైడెన్

వాషింగ్టన్: విదేశీ విద్యార్థులకు మేలు కలిగే విధంగా బైడెన్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్టుడెంట్ వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన సవరణలకు స్వస్తి పలికింది.
స్టుడెంట్ వీసాలపై నిర్ధిష్ట గడువు విధానానికి అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ రద్దు చేశారు.

విదేశీ విద్యార్థులు అమెరికాలో ఎన్ని రోజులు ఉండైనా చదువుకోవచ్చని, నిర్థిష్ట గడువు అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. ఎలాంటి గడువు విధించడం లేదని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యురిటీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం మూలంగా ఇండియాలో రెండు లక్షల మంది విద్యార్థులకు మేలు కలుగనున్నది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు యుఎస్ కు వెళ్తుంటారు. వీరిని నిలువరించేందుకు మాజీ అధ్యక్షుడు ట్రంప్ నాలుగేళ్లకు మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విదేశీ విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడం, యుఎస్ కంపెనీలు కూడా వ్యతిరేకించడంతో బైడెన్ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. ప్రజాభిప్రాయంలో 99 శాతం వ్యతిరేకిచండంతో ఇంటర్నేషనల్ స్టుడెంట్ వీసా నిబంధనల్లో సవరణలు తీసుకువచ్చిన, ట్రంప్ తెచ్చిన నిర్థిష్ట గడువును రద్దు చేశారు.

Leave A Reply

Your email address will not be published.