మాస్క్ లేకపోతే రూ.100 జరిమానా
అమరావతి: రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినతరం చేయాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటా సంచరిస్తే రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నిబంధనలు ఉల్లంఘించిన షాపులకు భారీ జరిమానా వేయాలని స్పష్టం చేసింది. అదే పనిగా నిబంధనలు ఉల్లంఘించిన వారి దుకాణాలను రెండు మూడు రోజులు మూసివేయాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇతర దేశాల్లో డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఉధృతమవుతుండడంతో ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏపి వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.