సముద్రంపై తేలియాడే నగరం

మాల్దీవులు: కాస్త ఏమాత్రం విరామం దొరికినా పలువురు మాల్దీవులకు పరుగెత్తుతున్నారు. బెస్ట్ టూరింగ్ స్పాట్ గా ఇది పేరొందింది. ఇంకొన్ని సంవత్సరాల్లో ఈ ద్వీపం కనుమరుగయ్యే ప్రమాదముండడంతో ముందుజాగ్రత్తగా మరో నగరానికి శ్రీకారం చుట్టారు.
దాని పేరే ఇన్నోవేటివ్ ఫ్లోటింగ్ ఐలాండ్ సిటీ.

భూమి లోపలికి సముద్రం నీరు వచ్చి మడుగులుగా (లాగూన్స్) ఏర్పడిన ప్రాంతంలో ఈ నగరాన్ని నిర్మాణం చేయనున్నారు. మాల్దీవుల విస్తీర్ణం 300 చదరపు కిలోమీటర్లు కాగా ఇక్కడ ఐదున్నర లక్షల మంది నివాసం ఉంటున్నారు. నెదర్జాలండ్ కు చెందిన డచ్ డాక్లాండ్స్ అనే సంస్థ ఈ ఫ్లోటింగ్ సిటీ డిజైన్ ను ప్రతిపాదించింది. అయితే 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ సిటీ పనులన్ని వచ్చే ఏడాది శ్రీకారం చుట్టనున్నారు. మెట్రో నగరానికి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రపంచంలో నిర్మిస్తున్న తొలి ఫ్లోటింగ్ సిటీ ఇదే. ఆఫీసులు, హాస్పిటళ్లు, స్కూళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, మల్టీ ఫ్లెక్స్ లు, పార్కులు ఉంటాయి. ఇక్కడ సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ నిర్మించే ఒక్కో ఇంటిని రూ.1.85 కోట్లుగా ధర ఖరారు చేశారు.

Leave A Reply

Your email address will not be published.