కోయలేని కంచె ఎక్కడో తెలుసా?

న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో కంచె లేకపోవడం మూలంగా చొరబాట్లు పెరిగి తీవ్రవాద కార్యకలాపాలు హెచ్చరిల్లుతున్నాయి. టెర్రరిస్టు మూకలు దేశంలోకి ప్రవేశించి బాంబు పేలుళ్లు, దాడులకు తెగబడుతున్నారు.
దేశ సరిహద్దుల్లో చేపట్టిన పూర్తి స్థాయి 7500 కిలోమీటర్ల పొడవు కంచె నిర్మాణం ఈ ఏఢాది చివరకి పూర్తి కానున్నది. ఎక్కడా గ్యాప్ లు లేకుండా పూర్తిస్థాయిలో నిర్మాణం చేస్తున్నారు. అక్కడక్కడా మూడు శాతం గ్యాప్ ల మూలంగానే దేశంలోకి చొరబాటుదారులు, టెర్రరిస్టులు ప్రవేశిస్తున్నారు. అయితే చొరబాటుదారులు ధ్వంసం చేయలేని విధంగా కంచెను పకడ్బందీగా నిర్మాణం చేస్తున్నారు.

కోయడానికి వీలుండదు, ధ్వంసం చేద్దామన్నా కూడా కుదరదు. అంతటి బలమైన కంచెను నిర్మించేందుకు భారత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది. సరిహద్దు వెంట శత్రు దాడులను తిప్పికొట్టేందుకు కృత్రిమ మేథ, రోటోబిక్ సాంకేతిక, డ్రోన్ టెక్నాలజీని వినియోగించనున్నారు. డి.ఆర్.డి.ఓ వంటి రక్షణ సంస్థలతో కలిసి దేశీయంగానే కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నారు. 2008-14 మధ్యకాలంలో సరిహద్దుల్లో 3,600 కిలోమీటర్ల కంచె నిర్మాణం జరగ్గా, 2014-20 వరకు 4764 కిలోమీటర్ల పొడవునా కంచె నిర్మాణం చేశారు. చైనా సరిహద్దుల్లో గతంలో ఏడాది కి 230 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరగ్గా, ఇప్పుడు 470 కిలోమీటర్ల పొడవునా రోడ్లు వేస్తున్నారు. బిఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ వివరాలు వెల్లడించారు. దేశ రక్షణ విధానంపై విదేశాంగ విధానం ప్రభావం లేదని ఆయన స్సష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.