5 చెప్పు దెబ్బలతో అత్యాచారం కేసు మాఫీ?

లక్నో: మహారాజ్ గంజ్ జిల్లాలో కోతిబార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలో మైనర్ బాలికను ఒక యువకుడు అత్యాచారం చేశాడు. గ్రామ పెద్దలు అతడిని పోలీసులకు పట్టించకుండా ఐదు చెప్పు దెబ్బల శిక్ష యువకుడికి విధించి చేతులు దులుపుకున్నారు.
గ్రామ పెద్దల తీర్పును బాలిక తల్లి తిరస్కరించింది.

అత్యాచారం చేస్తే ఐదు చెప్పు దెబ్బలు, రూ.50వేలతో ముగిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామ పెద్దలు ఇంతకు మించి ఏమి చేయలేమని, వినాల్సిందేనని స్పష్టం చేశారు. పంచాయతీ పెద్దల తీరుపై బాలిక తల్లి కోతిబార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడిపై పొక్సో చట్టం కింద కేసు నమదు చేసి అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.